డ్యూయల్ రోల్ లో ఎన్టీఆర్, మహేష్ మరియు ప్రభాస్?

డ్యూయల్ రోల్ లో ఎన్టీఆర్, మహేష్ మరియు ప్రభాస్?

Published on Jul 18, 2020 7:09 AM IST

టాలీవుడ్ లో తెరకెక్కనున్న మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ పై పరిశ్రమలో ఆసక్తికర వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆ వార్తల సారాంశం ఏమిటంటే ముగ్గురు టాలీవుడ్ స్టార్స్ తమ తదుపరి చిత్రాలలో డ్యూయల్ రోల్ చేస్తున్నారట. మహేష్, ఎన్టీఆర్ మరియు ప్రభాస్ వారి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో డ్యూయల్ రోల్ చేస్తున్నారట. ఎన్టీఆర్ తన 30వ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ తో ప్రకటించారు. ఈ మూవీలో ఎన్టీఆర్ ది డ్యూయల్ రోల్ అట.

అలాగే మహేష్ దర్శకుడు పరుశురామ్ తో ప్రకటించిన సర్కారు వారి పాట మూవీలో ఆయన రెండు భిన్నమైన షేడ్స్ కలిగిన డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. కాగా మరో స్టార్ హీరో ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీలో ప్రభాస్ ది కూడా డ్యూయల్ రోల్ అని ప్రచారం జరుగుతుంది. మరి ఈ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ పైవస్తున్న వార్తలపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది.

తాజా వార్తలు