ఎన్టీఆర్ నుండి వరుసగా భారీ చిత్రాలే..!

ఎన్టీఆర్ నుండి వరుసగా భారీ చిత్రాలే..!

Published on May 12, 2020 7:21 AM IST

ఇండియాలో అతిపెద్ద చిత్ర పరిశ్రమలలో ఒకటిగా ఉన్న టాలీవుడ్ గత కొన్నాళ్లుగా భారీ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల ఇమేజ్ పక్క పరిశ్రమలకు కూడా పాకడంతో వీరి మార్కెట్ పరిధి పెరిగిపోయింది. దీనితో ఖర్చుకు వెరవకుండా భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే ఈ కోవలో ముందుండగా నెక్స్ట్ ఎన్టీఆర్ కూడా వరుసగా భారీ చిత్రాలు చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే ఆయన రాజమౌళితో చేస్తున్న మల్లీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ 400కోట్లుకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో చేయనున్న తన 30వ చిత్రం కూడా భారీగానే ఉంటుందట. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ఇమేజ్ పాన్ ఇండియా స్థాయికి ఎదగడం ఖాయం అని భావిస్తున్న మేకర్స్ ఇది కూడా భారి బడ్జెట్ తో పెద్ద ఎత్తున నిర్మిస్తారట. ఆ తరువాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్నాడు, పలు భాషలలో విడుదల కానున్న ఈ మూవీ బడ్జెట్ 300కోట్ల పై మాటే. ఇలా ఎన్టీఆర్ లైన్ అప్ మొత్తం భారీగా ఉండనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు