ప్రస్తుతానికి అటకెక్కిన ఎన్.టి.ఆర్ – కొరటాల శివ ఫిల్మ్

ప్రస్తుతానికి అటకెక్కిన ఎన్.టి.ఆర్ – కొరటాల శివ ఫిల్మ్

Published on Nov 6, 2013 7:30 PM IST

ntr-and-koratala-shiva1
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్ళాలి. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకి సంబందించిన ముహూర్తం డిసెంబర్ లో జరుగుతుందని తెలిపారు. వీటన్నిటికీ తెరదింపుతూ ఈ రోజు కొరటాల శివ ఓ ట్వీట్ వేసాడు. ‘ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా మేకి పూర్తవుతుంది. మేమిద్దరం కలిసి యుటివి బ్యానర్ లో మహేష్ తో సినిమా చేసిన తర్వాత మా కాంబినేషన్లో సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నామని’ కొరటాల శివ ట్వీట్ చేసాడు.

మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్లో యుటివి సంస్థ వారు నిర్మించే సినిమా 2014 మధ్యలో మొదలయ్యే అవకాశం ఉంది. దేన్నీ బట్టి చూసుకుంటే కొరటాల శివ తన రెండవ ప్రాజెక్ట్ చెయ్యడానికి మరో 7-8 నెలల సమయం పడుతుంది. ముందుగా కొరటాల శివ కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ క్రియేటివ్ పరంగా కొన్ని విషయాల్లో హీరో – డైరెక్టర్ మధ్య చిన్న సమస్య రావడంతో ఆ సినిమా ఆగిపోయింది. కొరటాల శివ ఈ సంవత్సరం ‘మిర్చి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

తాజా వార్తలు