హరీష్ శంకర్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తూ దిల్ రాజు నిర్మిస్తున్న “రామయ్యా వస్తావయ్యా” ఆడియో లాంచ్ ఈరోజు విడుదలైంది. ఈ సినిమా తోలి సి.డి ని వి.వి వినాయక్ విడుదల చేసి రాజమౌళి కి అందజేశారు. వంశి పైడిపల్లి, గోపి చంద్ మలినేని వంటి అతిధులు హాజరయ్యి వేడుకని విజయవంతం చేసారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ‘నేను, వినాయక్ ఎన్.టి.ఆర్ ని టైగర్ గా చూపించామని, వంశి ‘బృందావనం’లో యంగ్ గా చూపించాడని కానీ ఈ సినిమాలో హరీష్ మాత్రం యంగ్ టైగర్ గా చూపించాడని’ కొనియాడారు.
ఈ వేదికపై ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ “నన్ను నేను ఆవిష్కరించుకోవడం కంటే నా దర్శకులే నన్ను ఎక్కువగా ఆవిష్కరిస్తున్నారని వినాయక్, రాజమౌళిలతో ఆయనకున్న బంధాలను తెలిపి, హరీష్ తనలో యూత్ ఫుల్ యాంగిల్ ను చూపించాడని తెలిపాడు. థమన్ తో 3 సినిమాలే కాదు కుదిరితే 30 సినిమాలు చెయ్యాలని ఉంది అని అన్నారు. దిల్ రాజు సోదరులతో ఆది సినిమా నుండి తనకున్న అనుభవాలని గుర్తుచేసుకున్నారు”. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన సమంత, శృతి వేడుకకు హాజరుకాకపోవడం అభిమానులకు నిరాశకు గురిచేసింది.