మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ ‘వార్ 2’ చిత్ర ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. బాలీవుడ్‌లో ఎంతో పాపులర్ అయిన ‘వార్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నాడు.
ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ ట్రైలర్ ఆద్యంతం మాస్ ఎలివేషన్స్, అదిరిపోయే యాక్షన్ విజువల్స్, ఆకట్టుకునే డైలాగులతో దుమ్ములేపింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తమ పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతేగాక, వారు చేసే యాక్షన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది.
యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించేందుకు ఈ స్టార్ హీరోలు సిద్ధమయ్యారు. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి