వైరల్ వీడియో : జిమ్‌లో ఎన్టీఆర్ హెవీ వర్కవుట్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఎన్టీఆర్-నీల్ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్తగా స్లిమ్ & లీన్ లుక్‌లో కనిపించనున్నారు. తన పాత్ర కోసం ఆయన కఠినమైన వర్కౌట్స్ చేస్తూ, ట్రాన్స్‌ఫర్మేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

తాజాగా ఆయన జిమ్‌లో షర్ట్‌లెస్ లుక్‌తో సిక్స్ ప్యాక్ యాబ్స్‌తో హెవీ వర్క్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు షాక్ తిన్నారు. ఇంత స్లిమ్ లుక్‌లో ఎన్టీఆర్ చేస్తున్న వర్కవుట్స్ వారిని ఇంప్రెస్ చేస్తున్నాయి.

ఇక ప్రశాంత్ నీల్ మాస్ విజన్‌తో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ ప్రెజెన్స్ కలిస్తే ఇండస్ట్రీలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ భారీ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version