మరికొద్ది సేపట్లో ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ మూవీ ఫస్ట్ లుక్

మరికొద్ది సేపట్లో ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ మూవీ ఫస్ట్ లుక్

Published on Apr 20, 2013 11:30 AM IST
First Posted at 11.30 on Apr 20th

NTR-Harish-Shankar

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా, హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్, ఎన్.టి.ఆర్ ఎనర్జిటిక్ ఫస్ట్ లుక్ ని ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాలకు రిలీజ్ చెయ్యనున్నారు. గత కొంత కాలగా ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టారు, అది కాదు ఇదీ అంటూ పలు వార్తలు వచ్చాయి. ఈ రోజుటితో ఆ వార్తలకు తెరపడనుంది. ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో ఓ డ్యూయెట్ సాంగ్ ని ఇటీవలే ఎన్.టి.ఆర్ – సమంతలపై హైదరాబాద్లో షూట్ చేసారు. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే హరీష్ శంకర్ దర్శకత్వం, మాస్ డైలాగ్స్ చెప్పడంలో ఫేమస్ అయిన ఎన్.టి.ఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కోసం మా సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.

తాజా వార్తలు