రాత్రిళ్ళు షూటింగ్ కంటిన్యూ చేస్తున్న ఎన్.టి.ఆర్

రాత్రిళ్ళు షూటింగ్ కంటిన్యూ చేస్తున్న ఎన్.టి.ఆర్

Published on Jul 9, 2013 8:42 AM IST

NTR-and-Harish-Shankar

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ రాత్రి వేళల్లో జరుగుతోందని తెలియజేశాము. ఇంకా ఈ నైట్ షెడ్యూల్స్ జరుగుతూనే ఉన్నాయి, ఈ రోజు ఉదయం 5:30 గంటల వరకూ కూడా ఈ చిత్ర యూనిట్ షూట్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సమంత హీరోయిన్ గా, శృతి హాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్న ఈ సినిమాలో అతని పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

తాజా వార్తలు