నటుడిగా, నిర్మాతగా అభిమానులను మెప్పించిన వారిలో పద్మశ్రీ మోహన్ బాబు ఒకరు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 500 సినిమాలకు పైగా నటించాడు. అలాగే ఆయన దాదాపు 58 సినిమాలను లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించాడు. నటుడిగా మీరు మంచి ఫామ్ లో ఉండగా ఎందుకు నిర్మాతగా మారారు అని అడిగినప్పుడు ఆయన మాట్లాడుతూ ” ఎన్ టి ఆర్ స్పూర్తితోనే నేను నిర్మాతగా మారాను . ఆయన ఒక సారి నాతో నీవు నిర్మాతగా మారితే నీ సినిమాలను నువ్వే నీకు నచ్చిన విదంగా తీసుకోవచ్చు. నీకు నచ్చిన స్క్రిప్ట్ ని నువ్వే సినిమాగా తీయవచ్చు అని అన్నాడు. అలాగే నేను నిర్మాతగా సినిమా తీసేటప్పుడు ఎప్పుడు కూడా జయాపజయాల గురించి ఆలోచించాను’ అని అన్నాడు. ప్రస్తుతం మోహన్ బాబు ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాని నిర్మిస్తూ నటిస్తున్నాడు. శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమాలో మంచు మోహన్ బాబు, విష్ణు మంచు, మనోజ్ మంచు, రవీన టాండన్, హసిక , ప్రణిత సుభాష్, వరుణ్ సందేశ్, తనిష్ లు నటిన్స్తున్నారు.