ఎన్టీఆర్ ఫేమస్ డైలాగే బాలయ్య సినిమా టైటిల్ !

ఎన్టీఆర్ ఫేమస్ డైలాగే బాలయ్య సినిమా టైటిల్ !

Published on Aug 30, 2020 3:48 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాల టైటిల్స్ అన్నీ పవర్ ఫుల్ గా ఉంటాయి. పైగా బోయపాటి శ్రీను – బాలయ్య బాబు కాంబినేషన్ అంటేనే పవర్ ఫుల్.. మరి వీరి కలయికలో వచ్చే సినిమా టైటిల్ ఇంకెంత పవర్ ఫుల్ గా ఉంటుంది. అందుకే ఈ సినిమా టైటిల్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అందులో ప్రధానంగా ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ బాగా వినిపిస్తోంది. అయితే తాజాగా ‘టార్చ్ బెర్రర్’ అనే మరో టైటిల్ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. టార్చ్ బెర్రర్ అనే డైలాగ్ ఎన్టీఆర్ అరవింద సమేతలో బాగా పేలిన సంగతి తెలిసిందే.

కాగా కథకు ‘టార్చ్ బెర్రర్’ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందట. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పై ఇంట్రస్ట్ గా ఉన్నాడట. ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటించే వరకూ ఆగాల్సిందే . ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోందని బోయపాటి ఇప్పటికే చెప్పారు. మొత్తానికి ఆ మధ్య టీజర్ లో మాత్రం బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో… పైగా పంచ కట్టులో వైట్ అండ్ వైట్ లో అభిమానులను బాగానే అలరించారు. ఏమైనా బాలయ్యకు ఈ సారి కూడా బోయపాటి సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

తాజా వార్తలు