‘కాంతార చాప్టర్ 1’ హిట్టు.. అదిరిపోయిందంటున్న ఎన్టీఆర్

‘కాంతార చాప్టర్ 1’ హిట్టు.. అదిరిపోయిందంటున్న ఎన్టీఆర్

Published on Oct 2, 2025 5:01 PM IST

JrNTR-Kantara-Chapter-1

కన్నడలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ మూవీ నేడు వరల్డ్‌వైడ్ థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించాడు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్స్‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ మూవీ మంచి హిట్ కావడం ఖాయమని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి.

దీంతో ఈ చిత్రం సక్సెస్ సాధించినందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన విషెస్ తెలిపాడు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ పోస్ట్ చేశాడు. ఇలాంటి భారీ సక్సెస్‌ను అందుకున్న ‘కాంతార చాప్టర్ 1’ చిత్ర యూనిట్‌కు అభినందనలు. నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి అదరగొట్టాడని.. ఇలాంటి విజన్‌ను ప్రోత్సహించిన హొంబలే ఫిల్మ్స్‌కు బెస్ట్ విషెస్ అంటూ తారక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్టీఆర్ ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు