తన డైట్ పద్దతులను మార్చుకున్న ఎన్.టి.ఆర్

ntr
మాస్ ప్రేక్షకులలో ఎన్.టి.ఆర్ ఫాలోయింగ్ అమోఘం. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నా హిట్ కోసం తనని తానూ మలుచుకుంటున్న తీరు అసాధారణం. ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమానుండి మన బుడ్డోడు స్టైల్ లపై ఎక్కువ దృష్టి చూడొచ్చు. తాను ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోకుండా ఆ రంగంలో నిష్ణాత్తులైన అనుభవశాలులను పెట్టుకున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ తన డైట్ పద్ధతులను కూడా మార్చుకున్నాడు. బిర్యానీలను, ఫాస్ట్ ఫుడ్స్ పెట్టాడు. హై ప్రోటీన్ లను, పండ్లను కాయగూరలను మాత్రమే తింటున్నాడు.

ప్రస్తుతం మన తారక రాముడు కందిరీగ శ్రీనివాస్ తీస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. మరి మనవాడి కొత్త లుక్ కోసం అంతా సిద్ధమేనా… చూడాలంటే మాత్రం వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే.

Exit mobile version