మళ్లీ సందడి చేయనున్న ‘ ఎన్.టి.ఆర్ – బ్రహ్మానందం ‘ ల కాంబినేషన్


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరియు బ్రహ్మానందం కలిసి నటించిన చిత్రం ‘ అదుర్స్ ‘ లో వీరిద్దరూ కలిసి పండించిన హాస్యం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఎన్.టి.ఆర్ రాబోయే చిత్రం ‘ బాద్షా ‘ లో మళ్లీ ఈ కాంబినేషన్ కనిపించనుంది. బాద్షా లో బ్రహ్మానందం సినిమా మొత్తం ఉండే ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్సకత్వం వహిస్తున్నారు, శ్రీను వైట్ల మరియు బ్రహ్మానందం కలయికలో మంచి హాస్యబరితమైన చిత్రాలు చాలా వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే బాద్షా లో లో బీభత్సమైన కామెడి ఉంటుందని అర్థమవుతోంది. జూన్ 1 నుంచి బాద్షా చిత్రం చిత్రీకరణ మొదలవుతుంది, కొన్ని వారల తర్వాత ఈ చిత్ర యూనిట్ యూరప్ లో చిత్రీకరణ జరుపుకోవడానికి బయలుదేరుతుంది. కాజల్ అగర్వాల్ ఈ చిత్రం లో కథానాయిక , తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ ఫై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version