రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడట. అలాగే ఎన్టీఆర్ సీన్స్ అన్ని అద్భుతంగా వస్తున్నాయట. మొత్తానికి ఎన్టీఆర్ ను హైలైట్ చెయ్యటానికి రాజమౌళి క్రేజీగానే ప్లాన్ చేస్తున్నాడు అన్నమాట.
ఇక ఈ సినిమాలో డైలాగ్ లు అద్భుతంగా ఉంటాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లే మెయిన్ హైలెట్ అవుతాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా గొప్పగా ఉంటాయట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కాగా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీల నుండి ఈ సినిమా పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి.