ఎన్టీఆర్ తో ప్రయోగాలు చేయకపోతే బెటర్..అందుకే త్రివిక్రమ్..!

ఎన్టీఆర్ తో ప్రయోగాలు చేయకపోతే బెటర్..అందుకే త్రివిక్రమ్..!

Published on Apr 26, 2020 8:55 AM IST

టాలీవుడ్ టాప్ దర్శకులలో త్రివిక్రమ్ ఒకరు. తన మార్కు డైలాగ్స్ మరియు స్టైలిష్ టేకింగ్ కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇక అల వైకుంఠపురంలో చిత్రంతో టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ హ్యాట్రిక్ మూవీ నాన్ బాహుబలి రికార్డ్స్ నమోదు చేసింది. ఇక త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం యంగ్ టైగర్ తో కమిటైన సంగతి తేలిసిందే. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.

ఇక త్రివిక్రమ్ తన మార్కు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఎంచుకున్నాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ తో ప్రయోగాలు చేయకపోవడమే బెటర్ అని ఆయన భావించారట. కారణం ఆర్ ఆర్ ఆర్ తరువాత ఈ చిత్రం విడుదల కానుంది, కాబట్టి రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ కూడా ఒకటి ఉంది. రాజమౌళితో చేసిన ఏ హీరో అయినా తన నెక్స్ట్ మూవీ పరాజయం కావాల్సిందే. దీనితో ప్రయోగాలకు దూరంగా ఉండాలని వీరిద్దరూ భావిస్తున్నారట. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ ఇంటెలిజెంట్ బిజినెస్ మెన్ గా కనిపిస్తాడని టాక్ వినబడుతుంది. అలాగే ఈ సినిమా కోసం అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు