చెమటలు చిందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ హీరోలు.

జక్కన్న ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, చరణ్ లతో బిజీ షెడ్యూల్ నడిపిస్తున్నారు. ఈ భారీ చిత్రం కోసం ఇద్దరు హీరోలు నిరవధికంగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఉద్యమ వీరుల కథ కావడంతో ఈ చిత్ర నిడివి కూడా అధికంగానే ఉంటుందని సమాచారం. దీనితో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పార్ట్ కూడా చాల ఎక్కువగా ఉంటుంది. ఇక గత ఏడాది ఈ సినిమా షూటింగ్ అనేక కారణాల చేత చాల సార్లు వాయిదా పడింది. దీనితో రాజమౌళి చెప్పిన విధంగా జులై 30న విడుదల చేయలేకపోయారు.

ఆర్ ఆర్ ఆర్ విడుదలను రాజమౌళి వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు . ఈ సారైనా చెప్పిన సమయానికి మూవీ విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్, చరణ్ లు ఆర్ ఆర్ ఆర్ కోసం యుద్ధ సన్నివేశాలు, గుర్రపు స్వారీల వంటి సాహసోపేత సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అలాగే ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రత్యేకంగా చిత్రీకరించాల్సివుంది.ఐతే హోళీ సంధర్భంగా ఆర్ ఆర్ ఆర్ హీరోలకు జక్కన్న కొంచెం విరామం ఇచ్చినట్టున్నారు. ఏదిఏమైనా జక్కన్న ఆర్ ఆర్ ఆర్ హీరోల చేత చెమటలు చిందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు.

Exit mobile version