ఎన్టీఆర్ 31 పాన్ ఇండియా దర్శకుడితోనే..!

ఎన్టీఆర్ 31 పాన్ ఇండియా దర్శకుడితోనే..!

Published on May 7, 2020 11:03 PM IST

టాలీవుడ్ క్రేజీ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత తన 30వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేస్తున్నారు. ఈ మూవీ కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్ కున్న క్రేజ్ రీత్యా త్రివిక్రమ్ మూవీ తరువాత ఆయన ఏ దర్శకుడితో మూవీ చేస్తాడు అనే ఆసక్తి ఫ్యాన్స్ లో పెరిగిపోయింది. ఐతే ఎన్టీఆర్ 31వ చిత్రం ఖచ్చితంగా ఓ పాన్ ఇండియా దర్శకుడితోనే ఉంటుందని వినికిడి. అది కూడా వేరే చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడితో ఆయన మూవీ చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తమిళ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా ఉన్న అట్లీ, కెజిఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఆల్రెడీ ఈ లిస్ట్ లో ఉన్నారు. అశ్వినీ దత్ అట్లీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో మూవీ చేయాలని గట్టి ప్రయత్నాలలో ఉన్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. వీరిద్దరూ కాక, బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పేరు కూడా తెరపైకి వచ్చింది. కాబట్టి ఈ ముగ్గురిలో ఓ దర్శకుడితో ఎన్టీఆర్ 31వ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనుంది.

తాజా వార్తలు