ఎన్టీఆర్, చరణ్ లకు రాజమౌళి ఛాలెంజ్ !

ఎన్టీఆర్, చరణ్ లకు రాజమౌళి ఛాలెంజ్ !

Published on Apr 20, 2020 3:19 PM IST

కరోనా దెబ్బకు లాక్ డౌన్ లో ఉన్న సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోవడంతో తమలోని మరో కోణాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంటి పని, వంట పని చేస్తూ తమ తోటి వారి చేత కూడా చేయించే పనిలో పడ్డారు. అర్జున్‌ రెడ్డి’ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా వంట సామాను కడుగుతూ, ఇంటిని శుభ్రం చేస్తూ కనిపించిన వీడియోను నిన్న ట్విట్టర్‌లో షేర్‌ చేసి ‘బీ ద రియల్‌ మెన్‌’ అని రాజమౌళికి ట్యాగ్‌ చేసి రాజమౌళికి ఛాలెంజ్‌ విసిరాడు.

కాగా సందీప్ సవాల్‌ను స్వీకరించిన రాజమౌళి, తాను ఇంటి పనిని చేస్తూ కింద ప్లోర్ ను శుభ్రం చేస్తూ ఉన్న వీడియోని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి తన ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డకి మరియు ఎం. ఎం. కీరవాణి అలాగే డైరెక్టర్ సుకుమార్ కి కూడా ఛాలెంజ్‌ విసిరాడు.

ఇక రాజమౌళి పోస్ట్ చేసిన వీడియోలో, రాజమౌళి కిటికీ గ్రిల్స్ శుభ్రం చేస్తూ నేలమీద క్లీన్ చేస్తూ కనిపించాడు. అలాగే వీడియో చివరి షాట్‌లో రాజమౌళి తన భార్య రమా వెనుకకు వచ్చి నిలబడటం కూడా బాగుంది. మరి రాజమౌళి ఛాలెంజ్ కి ఎన్టీఆర్, చరణ్ నుండి ఏ రేంజ్ వీడియో బయటకు వస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు