చిరు, బాలయ్య, నాగ్, వెంకీలకు .. ఎన్టీఆర్ ఛాలెంజ్ !

చిరు, బాలయ్య, నాగ్, వెంకీలకు .. ఎన్టీఆర్ ఛాలెంజ్ !

Published on Apr 21, 2020 10:44 AM IST

కరోనా లాక్ డౌన్ లో ఉన్న సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోవడంతో ‘బీ ద రియల్‌ మెన్‌’ అంటూ తమలోని మరో కోణాన్ని ప్రదర్శిస్తూ.. ఇంటి పని, వంట పని చేస్తూ తమ తోటి వారి చేత కూడా చేయించే పనిలో పడ్డారు. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ‘బీ ద రియల్‌ మెన్‌’ పేరుతో రాజమౌళికి ఛాలెంజ్‌ చేయటం, సందీప్ సవాల్‌ను స్వీకరించిన రాజమౌళి, తాను ఇంటి పనిని చేసి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డకి మరియు ఎం. ఎం. కీరవాణి అలాగే డైరెక్టర్ సుకుమార్ కి కూడా ఛాలెంజ్‌ విసిరాడు.

కాగా రాజమౌళి సవాల్‌ను స్వీకరించిన ఎన్టీఆర్.. ‘వంట సామానం తుడిచి శుభ్రం చేయడంతో పాటు.. అలాగే నేలమీద క్లీన్ కూడా చేశాడు, బయట గార్డెన్ లో కూడా శుభ్రంగా ఊడ్చాడు’ ఇదంతా చేస్తోన్న వీడియోని పోస్ట్ చేస్తూ తారక్ టాలీవుడ్ సూపర్ స్టార్స్ కి ‘బీ ద రియల్‌ మెన్‌’ ఛాలెంజ్ విసిరాడు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ పోస్టు చేస్తూ ‘మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం. అని బాలకృష్ణ బాబాయ్ కి, చిరంజీవిగారికి, నాగార్జున బాబాయ్ కి, వెంకటేష్ గారికి, అలాగే కొరటాల శివగారికి ఈ ‘బీ ద రియల్‌ మెన్‌’ ఛాలెంజ్ చేస్తున్నానని పోస్ట్ చేశారు. మరి ఎన్టీఆర్ ఛాలెంజ్ కి సీనియర్ స్టార్స్ నుండి ఏ రేంజ్ వీడియోలు బయటకు వస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు