ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తో సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ.!

ప్రస్తుతం మన టాలీవుడ్ లో యువ దర్శకుల హవా నడుస్తుంది. వారికి ఒక అవకాశం ఇస్తే చాలు ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ అండ్ ఆడియెన్స్ కు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటి సినిమాలు తీసి వారి టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. అలా లేటెస్ట్ గా మన తెలుగులో తన మొదటి సినిమాతోనే మంచి మార్కులు అందుకున్న టాలెంటెడ్ దర్శకుడు ఆర్ ఎస్ జె స్వరూప్.

నవీన్ పోలిశెట్టి హీరోగా తీసిన స్పై థ్రిల్లర్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”. ఈ సినిమా డీసెంట్ గా వచ్చి డబుల్ ప్రాఫిట్స్ ను అందుకొని ఒక్కసారిగా దర్శకునికి మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. అయితే మన తెలుగులో ఇలాంటి ఎన్నో చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ యువ దర్శకునితో ఒక ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు.

ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు. ఈ పోస్టర్ ను చూస్తే ఈ కాంబో నుంచి మరో సస్పెన్స్ థ్రిల్లర్ వచ్చేలా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ నుంచి మెగాస్టార్ చిరుతో “ఆచార్య”, కింగ్ నాగార్జున తో “వైల్డ్ డాగ్” లాంటి బడా చిత్రాలు రానున్నాయి. అలాగే ఈ నిర్మణ సంస్థ నుంచి గగనం, ఘాజీ, క్షణం వంటి ఆసక్తికర చిత్రాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ టాలెంటెడ్ దర్శకునితో ప్లాన్ చేసిన సినిమా కూడా మినిమమ్ గ్యారంటీ అని చెప్పాలి.

Exit mobile version