శవంగా కనిపించిన నిర్మాత రవిశంకర్ ప్రసాద్

ravishankar

యానంలో ఈ నెల 8వ తేదిన వాకింగ్ కి వెళ్లి కనిపించకుండా పోయిన ఆనంద్ సినీ సర్వీస్, ఆనంద్ రీజెన్సీ హోటల్స్ గ్రూప్ సంస్థల యజమాని రవిశంకర్ ప్రసాద్ ఈ రోజు అనగా శనివారం శవంగా కనిపించారు. ఆయన మృత దేహం ఐ.పోలవరం మండలం గోగులలంక రేవులో కనిపించింది. గత ఆరు రోజులుగా పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. అయితే ఆయనే ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా చంపి రేవులో పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవి శంకర ప్రసాద్ గతంలో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, స్నేహితుడు వంటి సినిమాలను నిర్మిచడం జరిగింది.

Exit mobile version