ప్రముఖ నిర్మాత పుండరీకాక్షయ్య కన్నుమూత

ప్రముఖ నిర్మాత పుండరీకాక్షయ్య కన్నుమూత

Published on Feb 2, 2012 1:05 PM IST


ప్రముఖ నిర్మాత మరియు నటుడు పుండరీకాక్షయ్య ఈ ఉదయం చెన్నైలో కన్నుమూసారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం మరణించారు. 1925లో ఆగష్టు 19న గుడివాడలో ఆయన జన్మించారు. ఆయన ఎన్టీఆర్ మరియు త్రివిక్రమరావు తో కలిసి నేషనల్ ఆర్ట్స్ థియేటర్ ని ప్రారంభించారు. ‘మహామంత్రి తిమ్మరసు’, ‘ఆరాధన’ మరియు ‘రావు గారి అబ్బాయి’ వంటి చిత్రాలను నిర్మించారు. విజయశాంతి ముఖ్య పాత్రలో నటించిన ‘కర్తవ్యం’ చిత్రంలో ఆయన పోషించిన ‘ముద్దుకృష్ణ’ పాత్ర ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచింది. కర్తవ్యంతో పాటు ఆయన పలు చిత్రాల్లో నటించారు.

123తెలుగు.కామ్ తరపున ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు