ప్రముఖ నిర్మాత మిస్సింగ్

ప్రముఖ నిర్మాత మిస్సింగ్

Published on Jul 9, 2013 1:48 PM IST

ఆనంద్ సినీ సర్వీసెస్ మరియు ఆనంద్ రీజెన్సీ హోటల్స్ అదినేత రవి శంకర్ ప్రసాద్ ప్రస్తుతం కనపడటం లేదు. ఈ విషయం పై యానం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది, ఎవరన్నా కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు. గత రెండు రోజులుగా ఆయన గురించి పోలీసులు గాలిస్తున్నారు, ఆయన ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తోంది. రవిశంకర్ ప్రసాద్ గారు కామర్స్ లో గ్రాడ్యువేట్. ఈ విషయం గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది తెలియగానే మీకందిస్తాము.

తాజా వార్తలు