ఈ సినిమాలను బ్యాన్ చేసిన బడా థియేటర్ సంస్థలు!

ఈ సినిమాలను బ్యాన్ చేసిన బడా థియేటర్ సంస్థలు!

Published on Oct 14, 2020 12:08 PM IST

ప్రస్తుతం థియేటర్స్ దేశ వ్యాప్తంగా తెరుచుకోడానికి రెడీ అవుతున్నాయి. ఈ తరుణంలో మొదటగా ఈ రేస్ లో బాలీవుడ్ చిత్ర పరిశ్రమే ముందు వరుసలో ఉంది. అక్కడ థియేటర్స్ వారే ముందుగా సంకేతాలు అందివ్వడంతో పలు చిత్రాలు ఈ థియేటర్స్ లో పడేందుకు రెడీ అయ్యాయి. ఇది బాగానే ఉన్నా పలు బడా థియేటర్స్ సంస్థలు మాత్రం కొన్ని సెలెక్టెడ్ సినిమాల ప్రదర్శనలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యమని చెప్పేసారు.

రీసెంట్ గా ఓటిటి రిలీజ్ కాబడిన “దిల్ బెచారా”, “శకుంతలా దేవి”, “సడక్ 2” “ఖుదా హఫీజ్” అలాగే “గుంజాన్ సక్సేనా”, “గులాబో సితాబో” వంటి బాలీవుడ్ బిగ్ చిత్రాలను ప్రముఖ మల్టీ ప్లెక్సులు అయిన పీవీఆర్, ఐనాక్స్, కార్నివాల్ వంటి వారు బ్యాన్ చేసారు. తమ మల్టీ ప్లెక్సులలో ఈ చిత్రాలు ప్రదర్శితం చేయబోమని డిసైడ్ చేసేసారు. గతంలోనే ఓటిటి విడుదలల పట్ల ఎంత రచ్చ నడిచిందో తెలిసిందే. ఇప్పుడు దానికి వీరు ఇలా బహుశా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్టు అనుకోవచ్చు. బ్యాన్ విధించడం వల్ల కూడా ఒరిగేది ఏమీ కూడా చెప్పాలి అది వేరే విషయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు