పవన్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూసే..!


పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అయ్యారు ఇక సినిమాలు చేయరని ఫ్యాన్స్ భావిస్తున్న తరుణంలో కమ్ బ్యాక్ ప్రకటించి వారికి ఆనందం పంచారు. హిందీ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ మూవీ కేవలం మూడు నెలల్లో పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ నెలలో ఈ మూవీ విడుదల జరగాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ దెబ్బేసింది. సరే సినిమా లేటైనా సినిమా టీజర్స్, పోస్టర్స్ తో సరిపెట్టుకుందాం అనుకుంటే అది కూడా జరిగే సూచనలు కనిపించడం లేదు.

వకీల్ సాబ్ చిత్ర సహ నిర్మాతగా ఉన్న బోని కపూర్ కరోనా లాక్ డౌన్ ఎత్తి వేసే వరకు తమ చిత్రాల నుండి ఎటువంటి అప్డేట్స్ ఉండవని లిఖిత పూర్వక నోట్ విడుదల చేశారు. కనుక సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు వకీల్ సాబ్ ప్రమోషన్స్ ఏమి ఉండవు. కాబట్టి ఆ మూవీ కి సంబంధించిన అప్డేట్స్ ఏమి ఉండవు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ చిత్రానికి నిర్మాతగా దిల్ రాజు ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

Exit mobile version