నిఖిల్ నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడో..?

Nikhil-Siddhartha

‘కార్తికేయ 2’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్, ఆ సినిమా సక్సెస్‌తో టాలీవుడ్‌ నుంచి బయటకూ తన మార్కెట్ విస్తరించుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుసగా వచ్చిన ‘స్పై’, ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాలు మాత్రం అతనికి తీవ్ర నిరాశే మిగిల్చాయి. ఈ పరాజయాల తర్వాత నిఖిల్ పాన్-ఇండియా స్థాయిలో స్ట్రాంగ్‌గా నిలబడే ప్రయత్నం చేస్తూ రెండు పెద్ద ప్రాజెక్ట్స్‌కి కమిట్ అయ్యాడు. అవే ‘స్వయంభు’ మరియు ‘ది ఇండియన్ హౌస్’.

‘స్వయంభు’ షూటింగ్ చాలా రోజుల క్రితమే ముగిసిపోయినా, ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్‌లో ఊహించిన దానికంటే ఎక్కువ టైమ్ వెచ్చిస్తున్నారు. మరోవైపు నాన్-థియేట్రికల్ డీల్స్ కూడా క్లోజ్ కాలేదు. అందుకే రిలీజ్ అనౌన్స్‌మెంట్ వాయిదా పడుతోంది. అదే సమయంలో రామ్ చరణ్ ప్రొడక్షన్ హౌస్ భాగస్వామ్యంతో తెరకెక్కుతున్న ‘ది ఇండియన్ హౌస్’ గతేడాది ప్రారంభమైంది కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.

ప్రస్తుతం ఈ రెండు సినిమాల విడుదలపై స్పష్టత లేకపోయినా, నిఖిల్ త్వరలో ఆసియన్ సునీల్ ప్రొడక్షన్‌తో మరో ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈలోగా తన నెక్స్ట్ రెండు చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తే బాగుంటుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version