‘అఖండ 2’ పై ఆ రూమర్స్ లో నిజం లేదు..!

akhanda

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇపుడు చేస్తున్న భారీ చిత్రం అఖండ 2 కోసం అందరికీ తెలిసిందే. బాలయ్య హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేసిన అన్ని సినిమాలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. అలా వచ్చిన అఖండ అయితే అన్నిటినీ మించి రికార్డులను సెట్ చేసింది. ఇక ఇపుడు పార్ట్ 2శరవేగంగా జరుగుతోంది. అయితే దీనిపై కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.

బాలయ్యకి, బోయపాటికి పడట్లేదు అని షూటింగ్ అంత సజావుగా జరగట్లేదు అంటూ కొన్ని రూమర్స్ మొదలయ్యాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మొత్తం షూట్ అనుకున్నట్టే వెళుతుంది. సో ఆ మాటల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే 14 రీల్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version