నో పాలిటిక్స్, నో డైరెక్షన్ అంటున్న వెంకటేష్

నో పాలిటిక్స్, నో డైరెక్షన్ అంటున్న వెంకటేష్

Published on Nov 27, 2013 7:18 PM IST

Venkatesh
నిన్నటి తరం టాప్ 4 హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు 27 సంవత్సరాలైంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన వెంకటేష్ కి ఫ్యామిలీ హీరోగా మంచి పేరుంది. ఈ సంవత్సరం మూడు సినిమాల్లో కనిపించిన వెంకటేష్ త్వరలోనే మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు.

తాజాగా ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ తోటి హీరోలు రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి అనడిగితే ‘ నేను రాజకీయాల్లోకి రాను. నన్ను పాలిటిక్స్ ఎప్పుడు ఆకర్షించలేదు. మన రాజకీయాల్లో పవర్ ఎక్కువ ఉంటుంది కానీ మనం ఏం చెయ్యాలి అనేదానిపై క్లారిటి తక్కువ ఉంటుంది. ‘అలాగే రాజకీయాల్లో నువ్వు ఏమనుకున్నావో అది చేసేదానికి ఉండదు, మీరు నిజాయితీ పరుడైతే రాజకీయాల్లో ఉండడం చాలా కష్టం. మన నిజాయితీని చంపేసుకోవాలి. అలానేను మారాలనుకోవడం లేదని’ వెంకటేష్ సమాధానం ఇచ్చాడు.

అలాగే నిర్మాతగా, డైరెక్టర్ గా మారే ఆవకాశం ఎమన్నా ఉందా అని అడిగితే ‘ నేను నటించిన చాలా సినిమాలకు నేను నిర్మాతగా వ్యవహరించాను. కానీ టైటిల్స్ లో నా పేరు వేసుకోలేదు. నేను హీరో కన్నా నిర్మాతగా అయితే ఎక్కువ యాక్టివ్ గా ఉంటాను. ఇక డైరెక్షన్ జోలికి అస్సలు వెళ్ళను. అది చాలా క్రియేటివ్ మరియు టైం తీసుకునే పని. అందుకే డైరెక్షన్ అస్సలు చెయ్యనని’ వెంకటేష్ అన్నారు.

తాజా వార్తలు