మెగా హీరో సాంగ్ కి కోటి వ్యూస్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్‌. నూతన దర్శకుడు సుబ్బు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుండి ‘నో పెళ్లి..’ వీడియో సాంగ్ రీసెంట్‌గా విడుదలైన విశేష ఆదరణ దక్కించుకుంటుంది. విడుదలైనప్పటి నుండే సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేసింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్‌.ఎస్‌.తమన్ సంగీతం అందించగా.. సాయితేజ్‌తో పాటు రానా, వరుణ్ తేజ్ ఈ పాటలో కనిపించడం విశేషం.

కాగా ఈ సాంగ్ యు ట్యూబ్ లో ఏకంగా 10 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. అంటే ఓ కోటి మంది ఈ సాంగ్ ని యూట్యూబ్ లో చూశారన్న మాట. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నాభా నటేష్ నటిస్తుంది. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని సమాచారం.

Exit mobile version