దాసరి నారాయణ రావు భార్య ఇకలేరు

దాసరి నారాయణ రావు భార్య ఇకలేరు

Published on Oct 28, 2011 6:26 AM IST

dasari birthday 26
దర్శకరత్న దాసరి నారాయణ రావు భార్య, దాసరి పద్మ ఈ ఉదయం అసువులుబాసారు. మంగళవారం తీవ్ర అనారోగ్యానికి గురవటంతో శ్రీమతి పద్మను సోమాజిగూడ వద్దగల యశోద హాస్పిటల్ లో చేర్చారు. పరిస్తితి విషమించటంతో ఆస్పత్రిలోనే పద్మ తుదిశ్వాస విడిచారు. దాసరిని ఎల్లప్పుడూ పద్మ వెన్నుతట్టి ప్రోత్సహించించే వారు. మృదుభాషిని, దయా హ్రుదయినిగా, గా ఆమెకు పరిశ్రమలో మంచి పేరుంది. ఆమె మరణం యావత్ చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతి కి గురిచేసింది.

కెరీర్ ఆరంభములో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను ఎంతగానో ప్రోత్సహించారు పద్మ. మరణవార్త వినగానే రామానాయుడు, మోహన్ బాబు తో సహా చిత్ర పరిశ్రమకు చెందిన ఎందరో ప్రముఖులు హుటాహుటీన ఆస్పత్రికి చేరుకొని అంజలి ఘటించారు.

ఈ బాధాకర సంఘటనకు 123telugu.com విచారం వ్యక్తం చేస్తుంది. శ్రీమతి పద్మ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, దాసరి కుటుంభ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియచేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు