సెన్సార్ బోర్డు వారు ఇటీవలే ఇచ్చిన సర్టిఫికేట్ ని మారుస్తూ టీవీలో ఎ సర్టిఫికేట్ ఉన్న సినిమాలు ప్రసారం చేయకూడదని కొత్త రూల్ పాస్ చేసారు. ఈ నిర్ణయాన్ని చూసి ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వస్తున్న పెద్ద హీరోలందరి సినిమాలు ఎ సర్టిఫికేట్ దక్కించుకుంటున్నాయి.
సెన్సార్ బోర్డు వారు అసభ్యకరమైన మాటలు, భయంకరమైన యాక్షన్ సన్నివేషాలు, ఎక్కువ అందాల ఆరబోత మొదలైన అంశాలు ఉన్న సినిమాలకు ఎ సర్టిఫికేట్ లేకుండా విడుదలకు అనుమతించడంలేదు. అందువల్లే ఇటీవలే విడుదలైన మహేష్ బాబు ‘బుజినెస్ మాన్’ మరియు ఎన్.టి.ఆర్ ‘దమ్ము’ సినిమాలు ఎ సర్టిఫికేట్ అందుకున్నాయి.
ఈ కొత్త రూల్ వల్ల సినీ నిర్మాతలు సాటిలైట్ రైట్స్ ద్వారా వచ్చే ఒక మంచి మొత్తాన్ని కోల్పోతారు. ఈ నిర్ణయాన్ని విని ఒక్క ఫిల్మ్ మేకర్స్ మాత్రమే కాదు సినీ అభిమానులు కూడా ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. త్వరలోనే ఈ విషయం పై ఇండస్ట్రీ ప్రముఖులు ఒక స్టేట్ మెంట్ ఇస్తారని భావిస్తున్నారు. ఈ విషయం పై ఇండస్ట్రీ వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మరియు ఈ విషయం ఎక్కడి వరకూ వెళ్లి ఆగుతుంది అనే దాని కోసం ఇంకొంత కాలం వేచిచూడాల్సిందే.