నాచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబులు మెయిన్ లీడ్స్ లో అదితిరావు హైదరీ, నివేతా థామస్ లు మెయిన్ లీడ్ లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “వి”. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. ఈ మధ్య కాలంలో ఓటిటిలో విడుదల అవుతున్న సినిమాల లిస్ట్ తో పోల్చుకున్నట్టయితే ఈ చిత్రం డెఫినెట్ గా భారీ రెస్పాన్స్ అందుకోవడం ఖాయం అని చెప్పాలి.
మాములుగా థియేటర్స్ లో విడుదలకు ముందు ఎలాంటి హైప్ ఉంటుందో ఈ చిత్రానికి ఇప్పుడు అలాంటి హైప్ కనిపిస్తుంది. అలాగే లేటెస్ట్ గా విడుదల కానున్న ట్రైలర్ కోసం కూడా చాలా మందే ఎదురు చూస్తున్నారు. ఇది వరకే ఇదే దర్శకునితో “జెంటిల్ మెన్” లో యాంటీ హీరో యాంగిల్ లో కనిపించి మెప్పించిన నాని ఈసారి ఫుల్ ఫ్లడ్జ్డ్ గా కనిపించనున్నట్టు ఉన్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉండనుందో తెలియాలి అంటే అప్పటి వచ్చే సెప్టెంబర్ 5 అమెజాన్ ప్రైమ్ డిజిటల్ ప్రీమియర్ వరకు ఆగాల్సిందే.