విడుదల తేది ఖరారుకాని ‘జెండా పై కపిరాజు’

Jendapai-kapiraju1
నాని హీరోగా నటించిన ‘జెండా పై కపిరాజు’ సినిమా విడుదల ఇబ్బందుల్లో వుంది. ఈ సినిమా మార్చి మొదటి వారంలోనే విడుదల కావలసి ఉంది. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల నిర్మాతలు సినిమాని విడుదల చేయలేకపోయారు. తమిళంలో ‘నిమిర్నధు నిల్’ పేరుతో నిర్మించిన ఈ సినిమా గత కొద్ది రోజుల క్రితం తమిళనాడులో విడుదలైంది. అక్కడ ఈ సినిమాకి ఆశించినంత రెస్పాన్స్ రాలేదు. దానితో ఈ సినిమా కోసం లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రావడం లేదు. వాసన్ విసువల్ వెంచర్స్ మరియు మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్ వారు కలిసి ఈ సినిమాని నిర్మించారు. నాని నటించిన గత రెండు సినిమాలు ‘పైసా’, ‘ఆహ కళ్యాణం’ లు బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించలేకపోయాయి. అలాగే ఈ సినిమా కూడా ఇప్పుడు అదే సమస్యని ఎదుర్కునే పరిస్థితుల్లో ఉంది. ఈ సినిమా పై నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందించాడు.

Exit mobile version