ఈ ఏడాదిలో ఈపాటికే రావాల్సిన పలు భారీ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమాలు కూడా ఒకటి. అయితే ఎప్పుడో మొదలైన ఈ సినిమాలపై సరైన క్లారిటీ లేక ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. విశ్వంభర కొంచెం ఓకే కానీ రాజా సాబ్ విషయం లో అభిమానులకి ఆసక్తి తగ్గిపోతుంది.
చిరు సినిమా నుంచి ఒక పాట అయినా వచ్చింది కానీ రాజా సాబ్ పై అనుకున్న అప్డేట్ కూడా రాలేదు. ఇంకోపక్క వీటి తోనే డీల్ అవుతూ వచ్చిన హరిహర వీరమల్లు ఫుల్ స్వింగ్ లో ఉంది. మెయిన్ గా విశ్వంభర, రాజా సాబ్ సినిమాలపై రిలీజ్ క్లారిటీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కానీ అవే పెద్ద సస్పెన్స్ గా ఉంచేశారు. మరి వీటిపై ఎప్పుడు క్లారిటీ వస్తుంది అనేది చూడాలి.