పవన్ “అయ్యప్పణం”కు ఇదింకా తేలలేదా?

పవన్ “అయ్యప్పణం”కు ఇదింకా తేలలేదా?

Published on Nov 13, 2020 8:58 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా కూడా ఇపుడు “వకీల్ సాబ్” టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. కానీ అది ఇప్పుడప్పుడే నెరవేరేలా కనిపించడం లేదు కానీ పవన్ చేయబోతున్న మిగతా సినిమాలకు సంబంధించి మాత్రం పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అయితే పవన్ ఇప్పుడు చేపట్టిన పలు ఆసక్తికర ప్రాజెక్టులలో “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఈ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఈ చిత్రంలో పవన్ తో పాటుగా మరో పవర్ ఫుల్ రోల్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఆ రోల్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మేకర్స్ ఈ మధ్యనే టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటిని అప్రోచ్ కాగా ఇంకా రానా నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. దీనితో ఈ రోల్ విషయంలో మరింత సస్పెన్స్ నెలకొంది. ఇంకా మేకర్స్ ఎవరిని సెట్ చేస్తారో చూడాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు