రద్దయిన వెంకీ – రామ్ ల మసాల ఆడియో రిలీజ్ ఫంక్షన్

masala-news

విక్టరీ వెంకటేష్ – ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ ‘మసాల’. ఈ సినిమాకి సంబందించిన ఆడియో ఫంక్షన్ ని రద్దు చేసారు. ఈ సినిమా ఆడియో డైరెక్ట్ గా మార్కెట్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చిన ‘బోల్ బచ్చన్’ మూవీకి రీమేక్.

హీరో రామ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘కొన్ని అనివార్య కారణాల వల్ల ఆడియో ఫంక్షన్ ని రద్దు చేసాము. ఈ సినిమా అధికారిక ట్రైలర్ మరియు మేకింగ్ వీడియోని మరో పది రోజుల్లో రిలీజ్ చేస్తామని’ తెలిపాడు. త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న ఈ మూవీ అధికారిక రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటించనున్నారు.

అంజలి, షాజన్ పదమ్సీ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి విజయ బాస్కర్ డైరెక్టర్. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని స్రవంతి రవికిషోర్ – సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version