నివేదా – రెజీనా యాక్షన్ ఎంటెర్టైనర్ పరిస్థితేంటి ?

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ కొరియన్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’ను రీమేక్ చేయబోతున్నారని లాక్ దౌన్ కి ముందు ఆ మధ్య బాగా వార్తలు వచ్చాయి. పైగా ఈ సినిమాలో నివేదా థామస్, రెజీనా కసాండ్ర ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారని.. ఈ ఇద్దరూ సినిమాలో పోలీస్ పాత్రల్లో కనిపించనున్నారని.. ఇప్పటికే ఈ ఇద్దరూ కొరియన్ యాక్షన్ కొరియోగ్రఫర్ల వద్ద శిక్షణ కూడా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఈ యాక్షన్ కామెడీ ఎంటెర్టైనర్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.

అసలు ఈ సినిమా ఉందా.. లేక ఆగిపోయిందా అనేది మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. నిజానికి చిత్రబృందం ఎప్పుడో షూట్ స్టార్ట్ చెయ్యాలని అనుకున్నప్పటికీ.. కరోనాతో పోస్ట్ ఫోన్ అయిందట. ఇప్పుడు అన్ని సినిమాలు తమ షూటింగ్ ను స్టార్ట్ చేశాయి కాబట్టి.. మరి ఈ సినిమాని కూడా మొదలుపెడతారేమో చూడాలి. అన్నట్లు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుందని కూడా బాగా వినిపిచింది.

Exit mobile version