First Posted at 09:20 on Apr 21st
‘అలా మొదలైంది’ సినిమా ద్వారా పరిచయం అయిన నిత్యామీనన్ ఆ చిత్రంనుండి మొదలుకుని, తానూ నటిస్తున్న ప్రతీ చిత్రంలోనూ నటనాపరంగా అంతకంతకూ ఎదుగుతుంది. ఒక విభిన్నమైన తారగా వెలుగుతూ ఎటువంటి పాత్రనైనా తన భుజాలపైన వేసుకుంటుంది. తన తాజా చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో తన నటన ద్వారా సినిమా అఖండ విజయానికి తోడ్పడింది. దీని ద్వారా టాలీవుడ్లో అగ్రతారల జాబితాలోలో తానూ స్థానం సంపాదించుకుంది.
నిత్య సినిమాల ఎంపిక విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తుంది. ఆమె ఒక మలయాళీ అయినా తన మొదటి సినిమానుండి తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. తాజా చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో తన పాత్రకే కాక తన కో-స్టార్ ఇషా తల్వార్ పాత్రకు సైతం తానే దుబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. నిత్యని త్వరలో మరలా శర్వానంద్ నటిస్తున్న ‘ఏమిటో ఈ మాయ’ సినిమా ద్వారా మనం చూడొచ్చు.