యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘హార్ట్ ఎటాక్. ఈ సినిమాని పూరి జగన్నాథ్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా యూనిట్ షూటింగ్ కోసం ఈ నెల 12న యూరోప్ వెళ్లనున్నారు. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను పాటలను చిత్రీకరించనున్నారని తెలిసింది. ఈ సినిమాలో నితిన్ సరసన అధాశర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి అనుప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాదిస్తుందని దీనితో ఇప్పటికే రెండు వరుస విజయాలను సొంతం చేసుకున్న నితిన్ హ్యాట్రిక్ సాదిస్తాడని ఈ చిత్ర యూనిట్ తెలియజేసింది.