నితిన్ రాబోతున్న చిత్రం “గుండె జారి గల్లంతయ్యిందే” ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. నిత్య మీనన్ మరియు ఇషా తల్వార్ లు నితిన్ సరసన కనిపించనున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఈ షెడ్యూల్ లో నితిన్ మరియు నిత్యల మధ్య పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. నవంబర్ మధ్యలో ఇషా తల్వార్ చిత్ర బృందంతో చేరుతుంది. విజయ్ కుమార్ కొండ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఐ అండ్రూ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నితిన్ మరియు నిత్య మీనన్ “ఇష్క్” చిత్రం తరువాత కలిసి నటిస్తున్న చిత్రం ఇది ఈ చిత్రం అదే మేజిక్ చేస్తుందో లేదో చూడాలి.