‘సీఎం’ను పెళ్ళికి ఆహ్వానించిన హీరో !

హీరో నితిన్ ఈ నెల 26వ తేదీన రాత్రి 8 గంటలకు వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న నితిన్, తన పెళ్లికి ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నాడు. ఈ సందర్భంగా తన వివాహానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ఆహ్వానించారు. ప్రగతిభివన్ లో సీఎంను కలిసి తన వివాహ ఆహ్వాన పత్రికను కేసీఆర్ కు అందించారు. కేసీఆర్ కూడా నితిన్ పెళ్ళికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇక నితిన్ మొదట దుబాయ్ లో భారీగా ఓ డెస్టినేషన్ మ్యారేజ్ ప్లాన్ చేసుకుంటే కరోనా రాకతో ప్లాన్ మొత్తం పాడైపోయింది. ఇకపోతే నితిన్ కరోనా అనంతరం వెంకీ అట్లూరి డైరెక్షన్లో ‘రంగ్ దే’ చిత్రం షూట్ ను చేయనున్నారు. ఇది కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంళో ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు నితిన్. ఇక కరోనా సంగతి ఎలా ఉన్నా…టాలీవుడ్ లో పెళ్లి సందడి నడుస్తుంది.

ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ తన ప్రేయసి డాక్టర్ పల్లవి పెళ్లి చేసుకున్నారు. ఇక రానా దగ్గుబాటి తన లవర్ మిహికా బజాజ్ మెడలో ఆగస్టు 8న మూడుముళ్లు వేయనున్నారు. కాగా కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గే సూచనలు లేవు. రోజులు గడిచే కొద్ది కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. దీనితో ఇంకా ఎదురు చూడడం అనవసరం అనుకున్న హీరోలు మొత్తానికి పెళ్లికి ముహూర్తం పెట్టేసుకుంటున్నారు.

Exit mobile version