యువ హీరో నితిన్ ఇటీవలే ‘ఇష్క్’ భారీ విజయంతో జోరు మీదున్నాడు. ఇదే ఊపులో ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే గౌతమ్ మీనన్ డైరెక్షన్లో నితిన్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కనుంది. జూన్ 2వ వారం నుండి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో నితిన్ సరసన కొత్త హీరొయిన్ నటించనుంది. ఇదే కాకుండా బెల్లంకొండ నిర్మాతగా చిన్ని కృష్ణ డైరెక్షన్లో కూడా మరో సినిమా తెరకెక్కనుంది. శృతి హాసన్ ఈ సినిమాలో హీరొయిన్ గా నటించనున్నట్లు సమాచారం. జూలై నెలలో ఈ సినిమా ప్రారంభమవుతుందని సమాచారం. త్వరలో ఈ సినిమాలకి సంభందించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. ఇష్క్ జూన్ మొదటి వారంలో 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. 7 సెంటర్లలో ఇష్క్ 100 రోజులు పూర్తి చేసుకుంటుంది.