తెలుగులో విడుదలకాబోతున్న నిత్యా మీనన్ కన్నడ చిత్రం

తెలుగులో విడుదలకాబోతున్న నిత్యా మీనన్ కన్నడ చిత్రం

Published on Apr 2, 2013 12:25 AM IST

Nitya-Menon
తమిళ్, మలయాళం సినిమాల తరువాత ఇప్పుడు కన్నడ సినిమాలు మన రాష్ట్రంలో తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాయి. ఇప్పటికే కొన్ని కన్నడ సినిమాలు రీమేక్ చెయ్యగా మున్ముందు మరిన్ని సినిమాలు అనువాదం రూపంలోనో, రీమేక్ రూపంలోనో మనముందుకు రానున్నాయి . పూజా గాంధి నటించిన ‘దండుపాళ్యం’ ఇక్కడ మంచి విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు నిత్యా మీనన్, శరత్ కుమార్ మరియు చేతన్ నటిస్తున్న మరో కన్నడ సినిమా తెలుగులో విడుదల కాబోతుంది. నిజ జీవితంలో ఒక పోలీస్ ఆఫీసర్ డైరెక్టర్ నాగశేఖర్ కి చెప్పిన కధే ఈ సినిమాకి ఆధారం. ఈ ‘మైనా’ చిత్రంలో చాలా భాగం మన ప్రాంతీయ వాతావరణానికి తగ్గట్టుగా మళ్ళి చిత్రీకరిస్తున్నారట. క్లైమాక్స్ కుడా మార్చారని సమాచారం.
‘జబర్దస్త్’ తరువాత నిత్యా మీనన్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలోనూ మరియు ప్రొడక్షన్ దశలో ఉన్న మరో ద్విభాషా చిత్రం ‘ఏమిటో ఈ మాయ’లోనూ నటిస్తుంది.

తాజా వార్తలు