నిత్యా మీనన్ మానభంగ బాదితురాలిగా కనిపించనుందా?

Nithya-Menen
ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం నిత్యా మీనన్ ఓ కొత్త సినిమాకి సైన్ చేసింది. ‘ఏమిటో ఈ మాయ’ షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సమ్మర్ పూర్తయ్యేంత వరకూ ఎలాంటి సినిమాకు సైన్ చెయ్యకుండా లాంగ్ గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ తాజా సమాచారం ప్రకారం తెలుగు, తమిళంలో రీమేక్ కానున్న మళయాళ సినిమా ’22 ఫీమేల్ కొట్టాయం’ సినిమాలో ప్రధాన పాత్ర చేయడానికి అంగీకరించింది. 2012 లో టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచిన ఈ మళయాళ సినిమాలో రిమ కల్లింగల్ ప్రధాన పాత్ర పోషించారు.

నిత్యా మీనన్ కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపుతోంది. ముఖ్యంగా ఈ సినిమాకి ఓ లేడీ డైరెక్ట్ చేయనుంది అని తెలియడంతో వెంటనే ఓకే చేసేసింది. ఈ సినిమాలో అన్యాయం జరిగిన మానభంగ బాదితురాలు ఎలా తన పగ తీర్చుకుంది అనే పాత్రలో నిత్యా మీనన్ కనిపించనుంది. వాస్తవానికి దగ్గరగా ఉండే ఈ సినిమాని నిత్యా మీనన్ లాంటి హీరోయిన్ చేస్తే కచ్చితంగా చూడాల్సిన సినిమా అవుతుంది. ‘అంతులేని కథ’, ‘చిలకమ్మ చెప్పింది’ లాంటి సినిమాల్లో నటించిన శ్రీప్రియ ఈ సినిమాకి దర్శకత్వం వహించనుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

Exit mobile version