యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ ను ఇచ్చారు. విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలకానుంది. నితిన్ హీరోగా నిత్యా మీనన్ , ఇషా తల్వార్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారని సమాచారం. ఈ సినిమా మంచి విజయంన్ని సాదిస్తుందని నితిన్ నమ్మకంతో వున్నాడు. గత కొద్ది రోజులకు ముందు జరిగిన ఇంటర్వ్యూ లో నితిన్ మాట్లాడుతూ ‘ గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాని మంచి కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించామని’ అన్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ప్రముఖ బ్యాట్ మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా ఒక పాటలో కనిపించనుంది.
సెన్సార్ పూర్తిచేసుకున్న ‘గుండెజారి గల్లంతయ్యిందే’
First Posted at 11:40 on Apr 17th