దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద మాత్రం సూపర్ హిట్ అవుతుంది. యూట్యూబ్‌లో ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ 100 మిలియన్ వ్యూస్‌ని సాధించింది. ఒక ప్లాప్ సినిమాకి ఈ రేంజ్ వ్యూస్ రావడం అంటే అది మాములు విషయం కాదు.
కాగా పెళ్లి నేపథ్యంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మరియు విలేజ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందట. అందుకే అన్ని వ్యూస్ వచ్చాయి అంటున్నారు. ఏమైనా ఈ చిత్రం థియేటర్స్ లో సేఫ్ ప్రాజెక్ట్ గా నిలవలేక పోయినా.. డబ్బింగ్ వెర్షన్ తో మాత్రం లాభాలను తెసోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో నితిన్ సరసన రాశి ఖన్నా నటించారు.