‘కోరియర్ బాయ్ కళ్యాణ్’ షూటింగ్ తిరిగి ప్రారంభం

Nithin-Yami-gauthami

నితిన్, యామి గౌతం హీరో హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘కోరియర్ బాయ్ కళ్యాణ్’. కొద్ది కాలం గ్యాప్ తరువాత ఈ సినిమా షూటింగ్ తిరిగి ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ సినిమా 40% పూర్తైందని నితిన్ తెలియజేశాడు. ప్రభుదేవా శిష్యుడు ప్రేమ్ సాయి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ డైరెక్టర్ గౌతం మీనన్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కథ కొత్తగా ఉంటుందని చెప్పిన నితిన్ ఈ సినిమా విజయంపై నమ్మకంగా వున్నాడు. నితిన్ నటించిన ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలు వరుసగా విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

Exit mobile version