కొరియర్ బాయ్ కళ్యాణ్ పై బోలెడు ఆశలు పెట్టుకున్న నితిన్, యామి గౌతం

Nithin-Yami-goutham
‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాలో నితిన్ సరసన యామి గౌతం నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ 50% పూర్తిచేసుకుంది. ఈ సినిమా పై నటీనటులు చాలా ఆనందంగా వున్నారు. హీరో, హీరొయిన్లు ఈ సినిమా తమకు, తమ కెరీర్ కు అదనపు బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు.

ఈ చిత్రం యొక్క కధ వినుత్నమైనది కనుక నితిన్ ఈ చిత్రంపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. ఇలాంటి కధ ఇప్పటివరకూ ఇండియన్ సినిమా రంగంలో రాలేదని అతని వాదన. ప్రభుదేవా శిష్యుడు ప్రేమ సాయి ఈ సినిమాకు దర్శకుడు. గౌతం మీనన్ నిర్మాత.

కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్. తమిళ, తెలుగు సినిమాలలో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version