మొదలైన నితిన్‌ కొత్త మూవీ

మొదలైన నితిన్‌ కొత్త మూవీ

Published on Feb 24, 2014 3:45 PM IST

Nithin-New-Movie--Launch-(1
నితిన్‌ హీరోగా ‘ఇష్క్‌’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ లాంటి సూపర్‌హిట్‌ల అనంతరం నిర్మాత నిఖితారెడ్డి శ్రావన సినిమాస్‌ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం ఈరోజు ప్రారంభమైంది. శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు నితిన్‌ కార్యాలయంలో జరిగాయి. దేవుని పటాలపై చిత్రీకరించిన తొలిషాట్‌కు నిర్మాత రామ్‌మోహ్మన్‌రావు క్లాప్‌నివ్వగా, సదానంద్‌గౌడ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా,దర్శకుడు సురేందర్‌ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

నిర్మాత నిఖితారెడ్డి మాట్లాడుతూ ‘నితిన్‌తో గతంలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌ పై మేము నిర్మించిన ఇష్క్‌,గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలు ఎంతటి ఘన విజయాన్ని సాదించాయో అందరికి తెలిసిందే. తాజాగా శ్రీనివాసరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రావన సినిమాస్‌ అనే కొత్త బ్యానర్‌ పై సరికొత్త ప్రేమకధా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. నితిన్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది,మార్చి మూడో వారంనుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంబిస్తామని’ తెలిపారు.

ఈ సినిమాకు హీరోయిన్‌ ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది. బ్రహ్మానందం,సోనూసూద్‌,అజయ్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందిస్తుండగా హర్షవర్ధన్‌ డైలాగ్స్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు