హార్ట్ అట్టాక్ మ్యూజిక్ తో ఆనందంలో వున్న నితిన్

Nithin1

‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న నితిన్ మంచి జోరు మీద వున్నాడు. ఈ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించింది అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం. ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్న నితిన్ పంచ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘హార్ట్ అట్టాక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు

అనూప్ రూబెన్స్ మొదటిసారి పూరితో కలిసి ఈ సినిమాలో పనిచేస్తున్నాడు. పూరికి మంచి మ్యూజిక్ సెన్స్ వుంది కాబట్టి ‘హార్ట్ అట్టాక్’ సినిమాలో కొన్ని మంచి పాటలు ఆశించవచ్చు. నితిన్ కు ఈ సినిమా పాటలపై మంచి నమ్మకం వుందని పూరికి అనూప్ కి ధన్యవాదాలు చెప్పాడు
ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ను ముగించుకుని శరవేగంగా సాగుతుంది. సెప్టెంబర్ ఆఖరి వారంనుండి స్పెయిన్ లో ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటుంది.

Exit mobile version